జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు : మేజిక్ ఫిగర్‌ను దాటిన కాంగ్రెస్ కూటమి

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో JMM- కాంగ్రెస్ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటింది. JMM- కాంగ్రెస్ కూటమి 44 స్థానాల్లో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అటు బీజేపీ 27 స్థానాల్లో లీడ్‌లో ఉంది. AJSU మూడు స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇతరులు 8 చోట్ల విజయం దిశగా వెళుతున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో JMM- కాంగ్రెస్ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి లీడ్‌లో కొనసాగుతోంది. JMM అగ్రనేత హేమంత్ సోరెన్ పోటీ చేస్తున్న రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచి.. బీజేపీ, JMM-కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ తర్వాత... రౌండ్స్‌లో JMM- కాంగ్రెస్ కూటమి ఫలితాల దూకుడు కనిపించింది. పరిస్థితి చూస్తుంటే.. జార్ఖండ్ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా నిజమయ్యాయనిపిస్తోంది. అధికార బీజేపీ ఆశించినస్థాయిలో సీట్లను గెలుచుకోలేకపోయింది.
రాష్ట్రంలోని 81 స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. బీజేపీకి ఈసారి పరాజయం తప్పకపోవచ్చని అంచనావేశాయి. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే... JMM- కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com