జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్-జేఎఎం కూటమి మధ్య హోరా హోరీ కొనసాగుతోంది. బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్-జేఎఎం కూటమి 38 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక జార్ఖండ్ వికాస్ మోర్చా 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 42 సీట్లు కావాలి. ప్రతి రౌండ్‌లోనూ ఫలితాలు మారుతుండడం ఉత్కంఠ రేపుతోంది.
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ పోటీ చేసిన దుంకా, బహరెట్ రెండు స్థానాల్లోనూ లీడ్‌లో ఉన్నారు. ఇక జంషెడ్ పూర్ ఈస్ట్‌లో సీఎం రఘువర్‌దాస్ ముందంజలో కొనసాగుతున్నారు. అటు ధన్ బాద్‌లో బీజేపీ నేత రాజాసింగ్ లీడ్‌లో ఉన్నారు. ధాన్వర్‌లో జేవీఎం నేత బాబూలాల్ మరాండీ, రాంచీలో బీజేపీ నేత సీపీ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com