పది, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్నవారికి జాబ్ మేళా.. హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో..

ఈనెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో కోటక్ బ్యాంకు, ఒప్పో మొబైల్స్, క్యూస్ క్రాప్, ఎల్‌పిఎఫ్ సిస్టమ్స్, ఐడిబిఐ, కార్వీ ఫోర్డ్, శుభగృహ ప్రాజెక్ట్, పేరం గ్రూపు వంటి 12 కంపెనీలు పాల్గొన్నట్లు చెప్పారు. మొత్తం 800 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పదవతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీకాం, ఏదైనా డిగ్రీ చదివిన వారు, ఫీల్డ్ సేల్స్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ కన్సల్టెంట్, ఫైనాన్సిషియల్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్చ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్స్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటివ్, సేల్స్ ట్రైనీస్, ప్రమోటర్స్, ఫీల్డ్ నెట్‌వర్క్, ఇంజనీర్స్ ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 19-35 సంవత్సరాల వయసు వారు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటాతో పాటు జిరాక్స్ సర్టిఫికెట్లతో మంగళవారం మల్లేపల్లి బాలుర ఐటిఐ క్యాంపస్ వద్దనున్న ఉపాధి కార్యాలయం, మోడల్ కెరియర్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే మేళాకు హాజరు కావల్సిందిగా కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com