తెలుగుజాతి గౌరవాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన వ్యక్తి పీవీ: జస్టిస్ చలమేశ్వర్

తెలుగుజాతి గౌరవాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన వ్యక్తి పీవీ: జస్టిస్ చలమేశ్వర్
X

PV

దేశంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ అన్నారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్‌లో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. తెలుగుజాతి గౌరవాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళిన గొప్ప వ్యక్తి పీవీఅని కొనియాడారు. నేటి తరం నాయకులు పీవీని దర్శంగా తీసుకోవాలన్నారు. పీవీ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వక్తలు కొనియాడారు.

Tags

Next Story