ప్రాణాలు కాపాడిన పర్స్.. బుల్లెట్ దూసుకొచ్చినా..

భూమ్మీద నూకలుంటే ఎంత పెద్ద అవాంతరం ఎదురైనా బతికి బట్టకడతారు. టైమ్ బాగోపోతే బాత్‌రూమ్‌లో కాలు జారి పడ్డా ప్రాణాలు పోతాయ్. అవును.. కొన్ని వింటే నిజమే అనిపిస్తుంది మరి. శరవేగంతో దూసుకు వచ్చిన బుల్లెట్ షర్ట్ జేబులో పెట్టుకున్న పర్స్‌ని తాకి అక్కడే ఆగిపోయిందంటే అదృష్టం అనక ఏమనాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్‌లో NRCకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. శాంతియుతంగా ఆదోళన చేయమంటూ పిలుపునిస్తున్నారు. కానీ ఆందోళన కారులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.
సరిగ్గా అలాంటి సమయంలో ఓ ఆందోళనకారుడు పోలీసుపై తుపాకీ గురిపెట్టాడు. బుల్లెట్ వచ్చి పోలీస్ షర్ట్ జేబుకి గట్టిగా తగిలింది. బలంగా తగలడంతో ఎవరైనా కొట్టారేమో అనుకున్నాడు. జేబుకి రద్రం పడేసరికి జేబులో ఉన్న పర్స్ బయటకు తీసారు. పర్సులో ఉన్న బుల్లెట్‌ని చూసి పోలీస్ షాకయ్యారు. ఆ పర్సులో ఏటీఎం కార్డు, శివుడి ఫోటో ఉన్నాయి. అవి బుల్లెట్ వేగాన్ని ఆపి, గుండెల్లోకి దిగకుండా అడ్డుకున్నాయి. నిజానికి పర్స్ ఎప్పుడూ ప్యాంట్ జేబులో పెట్టుకుంటారు. కానీ జనసంధ్రంలో పర్స్‌ని ఎవరైనా కొట్టేస్తారేమో అని షర్ట్ జేబులో పెట్టుకున్నారు. ఆ పర్సే అతడిని కాపాడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com