వక్ర బుద్దిని చూపించిన హెడ్ మాస్టర్.. ఉతికి ఆరేసిన స్టూడెంట్స్, టీచర్లు..


ఆడపిల్లలు అపర కాళి అవతారాలెత్తితేనే దుర్మార్గుల ఆటలకు బ్రేకులు పడతాయి. విద్యాబుద్దులు నేర్పాలసిన హెడ్ మాస్టరుకి చూపుల్లో చపలత్వం వచ్చింది. అమ్మాయిలను పాఠాల పేరుతో వేధించేవాడు. లేడీ టీచర్లను అవసరం ఉన్నా లేకపోయినా రూమ్‌లోకి పిలిపించుకుని మాట్లాడుతుండేవాడు.
ఈ సంఘటన తిరుపతి శివారులోని సత్యనారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్ర విద్యార్థినులను, టీచర్లను వేధిస్తున్నాడు. అతడి ఆగడాలను భరించలేక మౌనంగా రోదించేవారు. అతని ఆలోచనల్లో ఆంతర్యాన్ని గ్రహించిన టీచర్లు, విద్యార్థినులు తల్లిదండ్రులకు వివరించారు.
దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులంతా స్కూలుకు వచ్చి హెడ్ మాస్టర్‌ని నోటికి వచ్చినట్లు తిట్టి.. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో భయపడిపోయిన హెడ్ మాస్టర్ రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఎన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చినా మగాడు మారట్లేదు.. తన పశువాంఛకు ఆడపిల్లల జీవితాలు బలవుతున్నాయి.
అన్ని కళ్లనూ అనుమానించాల్సిందే.. అవసరమైనప్పుడు అందరి సహకారంతో వాడికి బుద్ది చెప్పాల్సిందే.. ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకుంటే ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది. అందుకే అమ్మాయిలు బీ ఎలర్డ్.. పెప్పర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోండి.. 100కి కాల్ చేయండి.. కామాంధుడిని కటకటాల వెనక్కు పంపించండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

