నేడు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం

నేడు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం
X

disa

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ బృందం హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణతో సంబంధం లేని డాక్టర్లతో రిపోస్ట్‌మార్టం నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదారాబాద్‌ చేరుకున్న ఎయిమ్స్‌ టీం... ఇవాళ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం నిర్వహించనుంది.

హైకోర్టు ఆదేశాలకు మేరు ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్తా ఆధ్వర్యంలోని టీం... రీ పోస్ట్‌మార్టం నివేదికను ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయనుంది. ఈ టీంలో డాక్టర్‌ ఆదర్శకుమార్‌, డాక్టర్‌ అభిషేక్‌ యాదవ్‌, డాక్టర్‌ వరుణ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇవాళ ఉదయం 9 గంటలకు గాంధీ ఆసుపత్రి మార్చరీలో రీపోస్ట్‌మార్టం ప్రారంభిస్తారు. ప్రక్రియ మొత్తానికి వీడియో తీసి, కలెక్షన్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరుస్తారు. రీపోస్ట్‌మార్టం పూర్తయ్యాక మృతదేహాలను నిందితుల బంధువులకు అప్పగించాలని గాంధీ ఆసుపత్రి వైద్యులకు ఇప్పటికై హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు రీపోస్ట్‌మార్టం పూర్తైన వెంటనే నలుగురు నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. అంత్యక్రియలు సైతం ఇవాళే జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story