కర్నూలు జిల్లా వైసీపీలో విబేధాలు

కర్నూలు జిల్లా వైసీపీలో విబేధాలు
X

ycp

కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో విబేధాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు...ఆయన ఫ్లెక్సీని తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోకుండా ఎమ్మెల్యే అవమానపరుస్తున్నాడంటూ ఆందోళనకు దిగారు వైసీపీ కార్యకర్తలు. కర్నూలు మండలం ఈ తాండ్రపాడులో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. కార్యకర్తల్ని అవమానించిన ఎమ్మెల్యే డౌన్‌ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన ప్లెక్సీని తగులబెట్టారు..

కోడుమూరు వైసీపీలో గత కొంతకాలంగా వర్గవిభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే సుధాకర్‌కు నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో.....ఆయనపై గుర్రుగా ఉన్నారు నియోజకవర్గ కార్యకర్తలు. దీనికి తోడు... కార్యకర్తల్ని అవమానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే . ఆయన ఫ్లెక్సీని తగులబెట్టడంతో.. విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.

Tags

Next Story