మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసను కావాలనే చేశారా?

మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసను కావాలనే చేశారా?
X

mangalur

కర్నాటకలోని మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసను కొందరు కావాలనే చేసినట్టు తెలుస్తోంది. అల్లర్లు సృష్టించాలని నిరసనకారులు ముందే ప్రణాళిక వేసినట్టు... స్పష్టంగా అర్థమవుతోంది. అల్లర్లకు ముందు రాళ్లను క్యారియర్‌ ఆటో నిండా బస్తాల్లో తీసుకొచ్చి పెట్టినట్టు.. సీసీటీవీ ఫూటేజీలో రికార్డ్‌ అయింది.

మంగుళూరు గోలిబార్‌లో జరిగిన ఆందోళనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. కొందరు నిరసనకారులు.. ముఖాలు గుడ్డలు కట్టుకుని.. రాళ్లు రువ్వారు. మరికొందరు అతి తెలివితో.. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని ధ్వంసం చేశారు. నిరసనల్లో హింస సృష్టించడానికి కొందరు ముందస్తు ప్లాన్‌ వేసినట్టు గుర్తించామని పోలీసులు అంటున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. పోలీసులు ఇక్కడికి వచ్చినపుడు... రహదారికి అడ్డంగా ఇనుపకడ్డీలు, రాళ్లు విసిరే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆందోళనకారులు ప్రి-ప్లాన్డ్‌గా చేసిన హింసకు సంబంధించిన వీడియోలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాల ఆధారంగా... హింసకు పాల్పడ్డ ఆందోళనకారులను గుర్తించే పనిలో ఉన్నారు కర్నాటక పోలీసులు.

Tags

Next Story