మహేష్‌బాబుకు మెగా సెగ..?

మహేష్‌బాబుకు మెగా సెగ..?

ma

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. వచ్చే నెల 11న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అయితే అంతకంటే గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేశారు. ఎలా చూసినా ఇది రేర్ కాంబినేషన్ కాబట్టి.. మహేష్ అభిమానులతో పాటు అటు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అయిపోయారు. హీరోలంతా ఒక్కటే అనే సందేశం ఈ కలయిక నుంచి వినిపిస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు అండ్ టీమ్ అసలు చిరంజీవిని ఎందుకు పిలిచామా అని తలలు పట్టుకున్నారు. ఏంటీ మెగాస్టార్ విషయంలో ఇంత దారుణంగా ఉంటారా అనుకుంటున్నారు కదూ. నిజమే.. కానీ ఇప్పుడు చిరంజీవి నటుడు మాత్రమే కాదు కదా.. మాజీ పొలిటీషియన్ కదా. అదే ఇప్పుడు మహేష్ బాబుకు మెగా సెగ తాకేలా చేసింది.

విషయం ఏంటంటే .. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చాడు కదా.. ఆ ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నాడు. తను మూడు రాజధానుల ఐడియాను సపోర్ట్ చేస్తున్నానని బాహాటంగా చెప్పాడు. దీంతో ఇప్పుడు అదే వేదికపై మహేష్ బాబు స్టాండ్ ఎలా ఉంటుంది అనే రచ్చ మొదలైంది. కృష్ణ కుటంబానికి జగన్ తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అంటే మహేష్ బాబు కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను ఒప్పుకుంటాడా..? అలా చేస్తే అక్కడి అభిమానుల్లో పార్టీల వారీగా చీలికలు వస్తాయి. సినిమా ఎలా ఉన్నా ఓ వర్గం ఖచ్చితంగా నెగెటివ్ ప్రాపగాండా మొదలుపెడుతుంది. దీంతో ఈ సెగ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు జరిగినా ఆశ్చర్యం లేదు. దీంతో అసలు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఎందుకు పిలిచామా అనే ఫీలింగ్ లో ఉంది సరిలేరు నీకెవ్వరూ మూవీ టీమ్.

మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవితో విభేదించాడు. ఆ గ్యాప్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో మెగా అభిమానులు కూడా ఇప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ నే ఎక్కువగ సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల చిరంజీవిని ఈ ఫంక్షన్ కు రావడం వల్ల వచ్చే లాభం కూడా పెద్దగా కనిపించదు. పైగా నష్టమే ఎక్కువగా జరిగేలా ఉంది. అందువల్ల సరిలేరు నీకెవ్వరుకు ఏ నష్టం జరగకుండా ఉండాలంటే.. ఇప్పుడు మెగాస్టార్ ఈ ఫంక్షన్ కు రాకుండా ఉండాలి. కానీ ఆల్రెడీ వీళ్లే పిలిచారు కదా. మళ్లీ వద్దని చెప్పలేరు. అందుకే ఏదో ఒక కారణం చెప్పి చిరంజీవే ఫంక్షన్ కు రాలేను అని చెబితే బావుండు అని ఎంటైర్ యూనిట్ ఫీలైపోతుంది. సో.. అసలు మెగాస్టార్ ఈ ఫంక్షన్ కు వస్తాడా..? ఆగుతాడా..? వస్తే పొలిటికల్ గా ఎలాంటి ఇష్యూస్ జరుగుతాయి..? రాకపోతే సరిలేరు నీకెవ్వరుపై మెగా అభిమానులు కక్ష పెంచుకుంటారు..? మరి ఇవన్నీ తెలియాలంటే కాస్త వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story