వాటికన్ సిటీలో వైభవంగా ప్రారంభమయిన క్రిస్మస్ సంబరాలు

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. క్రీస్తు స్మరణలతో, ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.. వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ లో క్రిస్మస్ నైట్ మాస్ నిర్వహించారు. బాల యేసును ముద్దాడి ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తల్లి పొత్తిళ్లలోకి చేర్చారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా వలసదారులకు మద్దతు ప్రకటించిన పోప్.. వాటికన్ తరలివచ్చిన విదేశీయులకు స్వాగతం పలికారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కథలను పోప్ చదివి వినిపించారు. రోమన్ చక్రవర్తి జనాభా లెక్కలకు ఆదేశించడం వల్లే ఇష్టం లేకపోయినా.. క్రీస్తు తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్, ఇంకా ఎన్నో వేల మంది నజ్రెత్ నుంచి బెత్లహాంకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జీసస్ కూడా సమాజం నుంచి దూరంగా బతకాల్సి వచ్చిందన్నారు. కొత్త సమాజం వలసలకు పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్ వలసదారులకు తన మద్దతు ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో క్రిస్మస్ వేడుకలకు దాదాపు పది వేల మంది తరలివచ్చారు. మిగతా వారందరూ చర్చి బయటే ఉండి సంబరాలను తిలకించారు. కట్టుదిట్టమైన భద్రతతో చర్చిలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల అందరినీ తనిఖీలు పూర్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com