అమరావతి ఆందోళనలు: రాజీనామాలు డిమాండ్ చేస్తున్న రైతులు

అమరావతి ఆందోళనలు: రాజీనామాలు డిమాండ్ చేస్తున్న రైతులు
X

PROTEST

అమరావతికి భూములిచ్చిన రైతుల గుండెలు మండుతున్నా. 8 రోజలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రతోనే రాజధాని తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారని దీన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధాని మారుస్తానంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. నాడు చంద్రబాబును నమ్మి కాదు.. ప్రభుత్వం హామీ ఇచ్చిందని భూములు ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాల్లో కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

అటు, తాళ్లాయపాలెం పుష్కర ఘాట్‌లో రాజధాని రైతులు జలదీక్ష చేపట్టారు. కృష్ణా నది ప్రవహించే ప్రాంతాన్ని ఎడారి అనడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధుల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం రాజీనామా చేస్తే ఏకగ్రీవంగా తిరిగి ఎన్నుకుంటామని చెప్తున్నారు. తాను కూడా రైతు అనే విషయం కొడాలి నాని గుర్తించుకోవాలని.. తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతున్నారు.

Tags

Next Story