కోల్‌కతా,కేరళ గోవాలలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు


కోల్‌కతాలో చర్చిలన్నీ విద్యుద్దీపాలతో ప్రత్యేక అలంకరణలో మెరిసిపోయాయి. అర్థరాత్రి ప్రార్థనలకు జనం భారీగా తరలివచ్చారు. క్రీస్తు పుట్టినరోజు వేడుకలను చర్చిలలో మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ప్రార్థనల తర్వాత పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇటు కేరళలో కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రమంతటా ఉన్న చర్చిలో మిడ్ నైట్ ప్రేయర్స్ ఘనంగా జరిగాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు పుట్టుకను వివరిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు అర్థరాత్రి ముందు నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గోవాలోని ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చిలో కూడా అర్థరాత్రి ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి చర్చికి హాజరైన వారికి మతాధికారులు తమ సందేశాలను వినిపించారు. అందరికీ శుభం జరగాలని దీవించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

