గుడ్ న్యూస్.. ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు
X

cm-kcr

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. ఆర్టీసీలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత కార్మికులతో భేటీ అయిన కేసీఆర్‌.. వారికి అనేక హామీలు ఇచ్చారు. రెండు నెలల జీతం ఇవ్వడంతో పాటు... ఉద్యోగుల పదవీ విరమణ వయసు రెండేళ్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇటీవలే ఉద్యోగులకు జీతాల బకాయిలు చెల్లించారు. ఇక తాజా ఉత్తర్వులతో మరో హామీ కూడా అమలు రూపం దాల్చింది.

Tags

Next Story