NRC, NPRకి సంబంధం లేదు.. హోంమంత్రి అమిత్ షా క్లారిటీ

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతుండగానే కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. దేశంలో జనగణన చేపట్టాలని నిర్ణయించింది. NPRకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఇప్పటికే NRC, CAA సెగ కంటిన్యూ అవుతున్న వేళ NPR అంశం తెరపైకి రావటం అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. NRCని నేరుగా అమలు చేయకుండా NPR పేరుతో దొంగచాటున కేంద్రం తమ లక్ష్యాన్ని పూర్తి చేయాలనే కుట్ర చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు పశ్చిమ బెంగాల్, కేరళా ముఖ్యమంత్రులు ఏకంగా NPRని తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ వ్యతిరేకతను ప్రకటించాయి. అయితే..ఈ వ్యతిరేకతను ఊహించని కేంద్రం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. తమలో NRC చర్చే జరగలేదని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. NRCపై ప్రధాని చెప్పిందే నిజమని.. దీనిపై పార్లమెంట్ , కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జనగణనకు NRCకి అసలు సంబంధమే లేదని అన్నారాయన.
పౌరసత్వ సవరణ బిల్లుపైనా క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. సీఏఏ అంటే పౌరసత్వం ఇవ్వటం కానీ, తీసుకోవటం కదన్నారు. NPRపై పశ్చిమబెంగాల్, కేరళ తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని. బెంగాల్‌లోని పేదల సంక్షేమానికి ఎన్‌పీఆర్ ఉద్దేశించినదని, దయచేసి రాజకీయాల కోసం అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలకు దూరం చేయవద్దని షా హితవు పలికారు.
ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా దేశంలో ఉండే వారిని డిటెన్షన్ సెంటర్ల నుంచి వారి సొంత ప్రాంతాలకి పంపిస్తామని అన్నారు అమిత్ షా. ఏ దేశమైనా ఎవరు పడితే వారు వచ్చి ఉండేందుకు అంగీకరించదు కదా? అని ప్రశ్నించారు. శరణార్థులను ్రభుత్వమే సొంత ఖర్చులతో తమ దేశానికి పంపిస్తామని అన్నారాయన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com