మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

3 రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన ఒక్క చోట నుంచే జరగాలన్నది తన నిశ్చితాభిప్రాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రంగం హైకోర్టు, అసెంబ్లీ ఒకేచోటే ఉండాలని, అప్పుడే పాలనలో సౌలభ్యం ఉంటుందని చెప్పారు. అతే.. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. తన 42 ఏళ్ళ అనుభవంతో ఈ మాట చెపుతున్నానన్నారు. వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో తన మాటల్ని చూడొద్దన్నారు. కేంద్రం అడిగితే తాను ఇదే అభిప్రాయం చెపుతానన్నారు వెంకయ్య నాయుడు.
అభివృద్ధి వికేంద్రీకరణకు మొదటి నుంచి కట్టుబడి ఉన్నానన్నారు వెంకయ్యనాయుడు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నాడు కేంద్రమంత్రిగా తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటయ్యేలా చూసానన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలిని చెప్పుకొచ్చారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఒకే చోట ఉండాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com