నిరసనలకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరిన రాజధాని రైతులు

నిరసనలకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరిన రాజధాని రైతులు
X

రేపటి ( శుక్రవారం) నిరసనలకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు రాజధాని రైతులు. మందడంలో డీఎస్పీ కార్యాలయానికి రైతులు వెళ్లగా.. అక్కడ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో సీఐకి వినతి పత్రం ఇచ్చారు. రైతులకు సంఘీభావంగా పోలీసులను అనుమతి కోరారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌. నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉందని డీజీపీనే స్పష్టం చేశారని.. గత నెలలో చంద్రబాబు రాజధాని పర్యటన సందర్భంగా డీజీపీ నిరసనలకు అనుమతి ఇచ్చారని రైతులు గుర్తు చేశారు. రేపు (సోమవారం ) తాము చేపట్టే శాంతియుత ఆందోళనలకు వెంటనే అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు రాజధాని రైతులు.

Next Story