ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇకలేరు

ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇకలేరు
X

badeti-bujji

ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందారు.. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతడ్ని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరినప్పటికీ ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. బడేటి బుజ్జి మృతితో టీడీపీకి పశ్చిమగోదావరి జిల్లాలో తీరని లోటు అయ్యింది.. 2014 నుంచి 20 19 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి పని చేశారు. గతంలో మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వహించారు. సినీ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు బడేటి బుజ్జి మేనల్లుడు.

Tags

Next Story