చేతబడి చేసిందనే నెపంతో 60 ఏళ్ల వృద్ధురాలిపై..

మూఢ నమ్మకాలతో అభం శుభం తెలియని వ్యక్తులను బలి తీసుకుంటున్నారు. చేతబడి పేరుతో హింసిస్తున్నారు. చేతబడి చేస్తుందనే నెపంతో తాజాగా కాకినాడలో 60 ఏళ్ల వృద్ధురాలిపై స్థానికులు దాడి చేయడం కలకలం రేపుతోంది. వృద్ధురాలిపై దాడి చేయడంతో పాటు ఆమె ఇంటిని కిటికీలను ధ్వంసం చేశారు. దీంతో విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలు పాపమ్మను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానికులకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో.. బాధితురాలి ఇంటి ముందు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
కాకినాడలోని భగీర్తమ్మ గుడి సమీపంలో సూరిబాబు అనే వ్యక్తి 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గ్రామంలో ఉండే వృద్ధురాలు పాపమ్మ చేతబడే కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే పాపమ్మను కలిసిన ఓ యువతి కూడా ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను వారించి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తనను పాపం పిలిచిందంటూ ఆ యువతి వింతగా ప్రవర్తించడంతో.. వృద్ధురాలి చేతబడే అని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి పాపమ్మ ఇంటికి చేరుకుని ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఆత్మహత్యలన్నింటికి పాపమ్మే కారణమని.. మరికొందరు ప్రాణాలు కూడా పోతాయని ఆమె తమకు చెప్పిందని స్థానికులు అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com