ఇవాళ మధ్యాహ్నం రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం

ఇవాళ మధ్యాహ్నం రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం
X

ycp

రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నట్టు సమాచారం. రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రేపు జరిగే మంత్రివర్గం సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ నివేదికపై చర్చించనున్న నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంత ఎమ్మెల్యేలు, నేతలు సమావేశం కానుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story