కమీషన్ ఏజెంట్ గా మారిన బడా నిర్మాత కొడుకు

కమీషన్ ఏజెంట్ గా మారిన బడా నిర్మాత కొడుకు

son-of-star-producer

సినిమా పరిశ్రమలో కొన్ని నిర్మాణ సంస్థలకు ఓ గౌరవం ఉంటుంది. ఆ నిర్మాతపైనా అదే భావన ఉంటుంది. రకరకాల మాటలు వినిపించే పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో క్రమశిక్షణ, ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. తన బ్యానర్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. వయసు మీదపడుతున్నా.. ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు. అలాంటి మంచి పేరున్న ఆ ప్రొడ్యూసర్ కొడుకు మాత్రం ఆయన పేరును అతి దారుణంగా చెడగొడుతున్నాడు.

నిజానికి ఆయన తన కొడుకును నిర్మాణ వారసుడుగా చూడాలనుకున్నాడు. కానీ అతను మాత్రం తండ్రి చాటున నిలబడి కమీషన్ ఏజెంట్ గా అవతారం ఎత్తాడు. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. తను ఇప్పటి వరకూ కనీసం ఒక్క సినిమా కూడా నిర్మించలేదు. కాకపోతే నిర్మించాలనే ప్రయత్నాలు చేశాడు. అవీ ఆగిపోతున్నాయి. కారణం.. మనోడి అత్యుత్సాహం. అన్నిట్లో వేలు పెడుతూ.. అనవసరమైన రచ్చ చేయడం అతని స్పెషల్ క్వాలిటీ. ఈ మధ్యే ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం.. ఈయన దర్శకుల పనిలో వేలు పెడుతూ.. విషయంలోనూ కెలకడం మొదలుపెట్టాడట. ప్రతి సీన్ నూ ‘ఇలా కాదు అలా’ అంటూ అడ్డదిడ్డంగా వారి పనికి ఆటంకం కలిగిస్తున్నాడు. ఓ నిర్మాతగా తన పరిధిని దాటి ‘దర్శకులను డైరెక్ట్’ చేసేందుకు ప్రయత్నిస్తూ వారిని ఓ రేంజ్ లో విసిగించాడట. సినిమా ప్రారంభానికి ముందే ఇలా ఉంటే ఇక సెట్స్ లో ఎలా ఉంటుందో ఊహించిన దర్శకులు ప్రాజెక్ట్స్ నుంచే డ్రాప్ అయ్యారు.

ఇక ఇటు ఇండస్ట్రీలో కూడా తానేదో తోపు అన్నట్టుగా ప్రవర్తించడంలో ఆ బడా నిర్మాత కొడుకు తర్వాతే ఎవరైనా అంటారు. అందరు నిర్మాతలను కలుస్తూ.. హల్చల్ చేస్తూ ఇండస్ట్రీని ‘ఎక్కడికో తీసుకువెళ్లాలి’ అనేలా బిల్డప్ ఇస్తున్నాడు. అతని వ్యవహారం తెలిసిన చాలామంది ఇప్పటికే దూరం పెట్టారు. కొత్తగా ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ అంటూ కొత్త వ్యాపారం మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ పెద్ద నిర్మాత వద్దకు వెళ్లి ప్రమోషన్స్ తగ్గించి.. మీకు కోటి రూపాయల లాభం వచ్చేలా చేస్తాను అని చెప్పాడట. దీంతో ఆ నిర్మాత అతనిపై ఓ రేంజ్ లో ఫైర్ అయినట్టు సమాచారం. ‘‘వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే.. కోటికి కక్కుర్తి పడి ప్రమోషన్స్ లేకుండా సినిమా ఎలా విడుదల చేస్తారు. ఇలాంటి పనికిమాలిన ఐడియాస్తో మరోసారి నా వద్దకు రావద్దు’’ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీన్ని బట్టి.. ప్రమోషన్స్ లేకుండా ప్రాఫిట్స్ రావు అన్న మినిమం సెన్స్ కూడా సదరు నిర్మాత కొడుక్కి లేదు అని అర్థమైపోతోంది. అందువల్ల దీనికి సపోర్ట్ వస్తుందని అనుకోలేం. ఒక్క సినిమా కూడా చేయకుండానే తను ఇండస్ట్రీని ఉద్దరిస్తానని తిరగడం.. ఇలా హల్‌చల్ చేయడం వెనక ఏముందో కానీ అతని ప్రవర్తన మాత్రం పరిశ్రమలో ఓ తలనొప్పిగా మారిందంటున్నారు. అంతే కాక తన తండ్రి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నప్పుడు అతని అతికి పవన్ కళ్యాణ్ చిరాకు పడ్డాడు. అతను సెట్లో ఉంటే షూటింగ్ కే రానని చెప్పాడు. అంటే అతను ఏ రేంజ్ ‘సోపురాజా’నో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇవన్నీ చాలవన్నట్టుగా తాజాగా ‘కమీషన్ ఏజెంట్’గా కొత్త అవతారం ఎత్తాడట. కమీషన్ ఏజెంట్స్ అనగానే ఒకరకంగా మోసగాళ్ల కిందే చూస్తారు పరిశ్రమలో. తన కమీషన్ కోసం ఎలాంటి మాటలైనా చెప్పే రకంగా భావిస్తారు. అలాంటిది ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకై ఉండి.. అతను కూడా అదే పనిచేస్తుండటం ఇండస్ట్రీలోచాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరోల డేట్స్ ఇప్పిస్తానని.. లేదంటే ప్రొడక్షన్ సెట్ చేస్తానని రకరకాలుగా మాటలు చెబుతూ వస్తున్నాడట. రీసెంట్ గా ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇప్పిస్తానని కూడా చెబుతున్నాడట. మొత్తంగా పండిత పుత్ర పరమ.. అన్నట్టుగా ఈ బడా నిర్మాత తనయుడి వ్యవహారం మారింది.

మొత్తంగా అలాంటి పెద్ద నిర్మాత పేరునే కాక బ్యానర్ ను సైతం భ్రష్టు పట్టించేలా ప్రవర్తిస్తున్నాడా కొడుకు అంటున్నారు. మరి ఆయనైనా తన కొడుకును కాస్త అదుపులో ఉంచితే బావుంటుందంటున్నారు. ముందు పదిమంది మెచ్చే సినిమాలు తీయమనండి.. తర్వాత పరిశ్రమను ఉద్ధిరించొచ్చు అని ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు అతనికి వార్నింగ్ లు ఇస్తున్నారట. మరి ఇప్పటికైనా ఈ పెద్ద నిర్మాత కొడుకు ప్రవర్తన మారుతుందో లేదో.. ?

Tags

Read MoreRead Less
Next Story