ఆలోచన అదే.. ముందుకు వచ్చిన 'ఐ స్టాండ్ ఫర్ నేషన్'

ఆలోచన అదే.. ముందుకు వచ్చిన ఐ స్టాండ్ ఫర్ నేషన్
X

i-stand

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో దాడికి తెగబడ్డాయి ముష్కర మూకలు.. ఈ రాక్షస కాండలో 40 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. మనతో సంబంధం లేకున్నా.. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సరిహద్దు సైనికుల్ని కోల్పోయాం.. ఇప్పటికే ఆ అమానుష ఘటన మిగిల్చిన భయం వీడిపోలేదు. ఐతే మన కొసం.. మన దేశం కోసం.. అనుక్షణం భయానక పరిస్తితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల కోసం మనం చేస్తున్నది ఏం లేదు. ఇదే ఆలోచనతో ముందుకు వచ్చిందే ఐ స్టాండ్ ఫర్ నేషన్..

దేశ రక్షణ కోసం అమరులైన వీర సైనికులను స్మరించుకొంటూ పుల్వామా ఘటన జరిగిన రోజున 2020 ఫిబ్రవరి 14న సరిగ్గా 3 గంటల 14 నిమిషాలకు దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం అమర సైనికులకు నివాళి అర్పింద్దాం అంటూ ముందుకొచ్చింది ఈ ఐ స్టాండ్ ఫర్ నేషన్ అనే ఆర్గనైజేషన్.

యావత్‌ భారత జాతిని ఏకం చేసే ఆలోచన ఇది.. ప్రతీ భారతీయుడి దేశభక్తిని తట్టిలేపే ముందడుగిది.. సరిహద్లుల్లో ప్రాణాలు కోల్పోతున్న వీర జవాన్ల స్పూర్తిని దేశమంతా చాటేందుకు ఈ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు నిర్వాహకులు.

ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ రంగాలతోపాటు వివిధ వర్గాల నుంచి ముఖ్యంగా సామాన్య జనం నుంచి ఊహించని స్తాయిలో మద్దతు అందుతోందని అంటున్నారు.

దేశం అంతా వారి వెంటే ఉందని వీర సైనికులకు మనోథైర్యాన్ని ఇవ్వడమే తమ లక్ష్యం అన్నారు. అమర సైనికులకు నివాళిని అర్పిస్తూ ఈ ఈవెంట్ రూపొందిచామంటున్నారు. పలు ఎన్‌జీవోలు, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 17 నగరాలు, 27 స్టేడియాల్లో ఐ స్టాండ్ ఫర్ నేషన్ ప్రోగ్రాం ఉంటుందని, భవిష్యత్తులో ఐ స్టాండ్ ఫర్ నేషన్ పేరుతో రైతులకోసం, మహిళల కోసం., విద్యార్దులకోసం మరిన్ని కార్యాక్రమాలు చేపట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Tags

Next Story