న్యూజీలాండ్ లో అగ్నిపర్వతం పేలడంతో తెలంగాణ మహిళ మృతి..

న్యూజీలాండ్ లో అగ్నిపర్వతం పేలడంతో తెలంగాణ మహిళ మృతి..
X

newziland

న్యూజీలాండ్ లోని పర్యాటక ప్రాంతం వైట్ ఐస్ ల్యాండ్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిపర్వతం పేలడంతో పదుల సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన మయూరి సింగ్ చౌహాన్ అనే మహిళ మృతిచెందారు. మయూరి సింగ్ కు 70 శాతం గాయాలు కావడంతో 17 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె.. బుధవారం మృతిచెందారు. ఇక, ఆమె భర్త ప్రతాప్ సింగ్ 40 శాతం గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమెరికాలోని అట్లాంటాలో నివాసం వుంటున్న ప్రతాప్ సింగ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా గుర్రాల తండా. ప్రతాప్‌ సింగ్‌ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లాడు. అక్కడ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ నెల 9న ప్రతాప్ సింగ్ తన కుటుంబంతో కలిసి న్యూజీలాండ్ లోని వైట్ ఐస్ లాండ్ కు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. దీంతో ప్రతాప్ సింగ్ తో పాటు.. ఆయన భార్య మయూరి సింగ్ చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు.

మూయూరి సింగ్ మృతితో వారి స్వగ్రామం గుర్రలతండా గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలావుంటే, ప్రతాప్ సింగ్ ఆరోగ్యం కొంత మెరుగైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మయూరి సింగ్ మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఇక, అగ్నిపర్వతం పేలుడు ఘటనలో మొత్తం 47 మంది చిక్కుకున్నారు. వీరిలో స్పాట్ లోనే కొందరు చనిపోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఇంకా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Tags

Next Story