వైద్యం గ్రామీణ స్థాయికి చేరాలి: వెంకయ్యనాయడు

వైద్యం గ్రామీణ స్థాయికి చేరాలి: వెంకయ్యనాయడు
X

venki

ప్రజలు వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజమండ్రిలో డెల్టా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభంత్సోవం ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి.. జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరానికి రావడం ఆనందంగా ఉందన్నారు వెంకయ్యనాయుడు. ఫిట్‌ ఇండియా మనకు చాలా అవసరమని అందుకే మన ప్రధాని ఫిట్‌ ఇండియా ప్రారంభించారన్నారు. అత్యాధునిక వైద్య సేవలు ఓ ప్రాంతానికి పరిమితం కావద్దొన్నారు. ప్రజలందరికీ సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావాలన్నారు. వైద్యం గ్రామీణస్థాయికి చేరాలని వెంకయ్య పిలుపునిచ్చారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు వెంకయ్య నాయుడు. ప్రతీ ఒక్కరు శారీరక శ్రమ చేయాలన్నారు.

Tags

Next Story