పల్లెప్రగతి యాప్‌ను ప్రారంభించిన ఆర్ధిక మంత్రి హరీష్ రావు

పల్లెప్రగతి యాప్‌ను ప్రారంభించిన ఆర్ధిక మంత్రి హరీష్ రావు
X

harishrao

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామకార్యదర్శులు, సర్పంచులు కీలకపాత్రపోషించాలన్నారు ఆర్ధిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో జరిగిన జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జనవరి మొదటి వారంలో నిర్వహించనున్న రెండో విడత పల్లెప్రగతి యాప్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపిటీసీలు, సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పల్లెప్రగతిపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. పదిరోజులపాటు ప్రతిఒక్కరు పనుల్లో నిమగ్నమై ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చూడాలనిమంత్రి వారికి సూచించారు.

Tags

Next Story