పరగడుపున తేనె, వెల్లుల్లి కలిపి తీసుకుంటే..

వంటల్లో వాడే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బయాటిక్‌గా పని చేసే వెల్లుల్లి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరం ఎలాంటి ఇన్‌ఫెక్షన్లైనా ఎదుర్కుంటుంది. రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
వీటిని కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాల కారణంగా నొప్పులు, వాపులు తగ్గుతాయి. డయేరియా, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం ద్వారా నివారించొచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ ఈ మిశ్రమం దూరం చేస్తుంది. సీజన్‌తో పాటు వచ్చే జలుబు, జ్వరం, సైనస్ సమస్యలను నివారిస్తుంది.
శరీరంలోని విషపదార్ధాలను, క్రిములను ఈ మిశ్రమం రెగ్యులర్‌గా తీసుకోవడం వలన బయటకు వెళ్లి పోతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల చర్మంపై వయసు కారణంగా వచ్చే ముడతలు తగ్గుతాయి. చర్మం నిగనిగలాడుతూ యవ్వనంగా మెరుస్తుంది. అందుకే ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటు ఉన్నా దానికి ఓ అరగంట ముందు ఈ మిశ్రమం ఒక స్పూన్ తీసుకుంటే మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com