పదవతరగతి అర్హతతో నాబార్డ్‌లో ఉద్యోగాలు..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ NABARD ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 73 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 జనవరి 12 లోగా దరఖాస్తు చేయాలి. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజీ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు https://www.nabard.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు:73.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 25.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 12.. విద్యార్హత: 2019 డిసెంబర్ 1 నాటికి 10వ తరగతి పాసై ఉండాలి. డిగ్రీకన్నా ఎక్కువ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. వయసు: 2019 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com