బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం
X

ramnath-kovind

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు వచ్చారు. అతిథులందరికీ రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. వచ్చిన వారందరినీ కోవింద్‌ ఆప్యాయంగా పలకరించారు. శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ వచ్చారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ నెల 23న మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. తిరిగి గురువారం హైదరాబాద్ వచ్చారు. శనివారం రామ్‌నాథ్ కోవింద్ తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.

Tags

Next Story