కామాంధులకా సన్మానాలు, సత్కారాలు.. చిన్మయి ఫైర్

కామాంధులకా సన్మానాలు, సత్కారాలు.. చిన్మయి ఫైర్
X

గొప్ప వ్యక్తులకు చేసే సన్మానాలు, సత్కారాలు ఇలాంటి దుర్మార్గులకు చేస్తున్నారా.. తప్పు చేసిన వాడు తప్పించుకు తిరుగుతున్నాడు. సంఘంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు. 9మంది మహిళలను లైంగికంగా వేధించిన ఆరోపణలున్నా తమిళ సినీ కవి వైరముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆయన తమిళ భాషకు చేసిన సేవలకుగాను డాక్టరేట్ ఇస్తున్నారని ఆరోపిస్తూ, దాంతో పాటు ప్రసిద్ధ కామాంధుడు అని బిరుదు కూడా ఇస్తే బాగుంటుంది అని సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

వైరముత్తు ఆగడాల గురించి గొంతు చించుకున్నా పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై ఆరోపణలు చేశాననే నెపంతో తనను డబ్బింగ్ నుంచి తప్పించారని అంటున్నారు. తప్పు చేసిన వాడినే సమర్ధిస్తున్నారు. విచారణ జరపకపోగా ప్రముఖుల చిత్రాల్లో అవకాశాలు ఇస్తూ అతడి ఆగడాలను సమర్ధిస్తున్నారు. లోకమంతా ఆయనకు కీర్తి కండువా కప్పుతోంది.. ఇలాంటప్పుడు కామాంధులకు మారే అవకాశం ఏది.. మగాడి కామదాహానికి అమాయకపు ఆడపిల్లలు బలికావలసిందే.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైరముత్తుని సన్మానించడం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తోంది చిన్మయి.

Next Story