విహార యాత్రలోనే.. అనంత లోకాలకి.. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం

దంపతుల విహార యాత్ర విషాదాన్ని నింపింది. పర్యాటక ప్రేమికుల జంట ఆనందాన్ని అంతం చేసింది. ఐస్లాండ్ దీవిలో అగ్ని పర్వతం పేలడంతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం గుర్రాల తండా గ్రామానికి చెందిన మయూరి సింగ్ మృతి చెందారు.
గుర్రాల తండా గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్, ఆయన భార్య మయూరి సింగ్ దంపతులు 20 ఏళ్ల కిందట అమెరికాకు వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడడ్డారు. దంపతులు ఇద్దరూ తరచూ పర్యాటక యాత్రలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ నెల 9న ఐస్లాండ్ దీవులకు వెళ్లారు. మర పడవలతో సముద్రంలో దీవులను తిలకిస్తుండగా ఒక్కసారిగా అగ్ని పర్వతం పేలింది. దీంతో వీరు ప్రయాణిస్తున్న పడవపపై లావా పడింది మయూరి సింగ్‌తో పాటు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రతాప్ సింగ్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి.
దంపతులు ఇద్దరికీ చికిత్స చేస్తుండగా మూడు రోజుల తరువాత మయూరి సింగ్ మృతి చెందారు. ప్రతాప్ సింగ్ 40 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈవిషయం ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com