సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరోనే.. దొంగల్ని వెంబడించి..

సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరోనే.. దొంగల్ని వెంబడించి..

Raghu-Bhat

సినిమాల్లో అయితే హీరోగారు షర్ట్, ప్యాంట్ నలక్కుండా ఒంటి చేత్తో వందమందినైనా చితక్కొట్టేయగలరు. హీరోయిన్ పర్స్ కొట్టేసిన దొంగ చిటికెలో మాయమైనా వాడి కాలర్ పట్టుకుని వచ్చి హీరోయిన్ కాళ్లమీద పడేలా చేయగలడు. మరి ఆ సినిమాకి, ప్రేక్షక దేవుళ్లకీ అతడే హీరో.. నిజజీవితంలోకి వచ్చేసరికి ఆయన కూడా ఓ మామూలు మనిషే.

దొంగ దోచుకుపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. కానీ కన్నడ హీరో రఘుభట్ నగదుతో ఉడాయిస్తున్న చోరులను వెంబడించి పట్టేశారు. రీల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకున్నారు. బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున క్యాబ్ డ్రైవర్‌ నుంచి నగదు, బంగారు గొలుచు చోరీ చేసి పరారీ అవుతున్న దొంగలను అటుగా ఫార్చ్యూన్ కారులో వెళుతున్న హీరో రఘుభట్ గమనించారు.

వెంటనే దొంగల బైక్‌ను వెంబడించారు. ఓ స్కూల్ సర్కిల్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే రఘుభట్ కారు దిగి దొంగలిద్దరినీ పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి దొంగలు మోహిన్, అబ్దుల్లాఅను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read MoreRead Less
Next Story