అమరావతి భూములు హిందూ ధర్మానికే చెందాలి: చక్రపాణి మహరాజ్

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హిందూమహాసభ మరోసారి డిమాండ్ చేసింది. రాజధాని తరలింపు ఆలోచనను విరమించుకోవాలని.. చక్రపాణి మహరాజ్ ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. అలాగే అమరావతి హిందువుల సాంస్కృతిక రాజధాని అని.. అక్కడి రైతులు ఇచ్చిన భూములు హిందూ ధర్మానికే చెందాలన్నారు. హిందువుల భూములను ఇతర ధర్మాల వారికి ఇవ్వడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చక్రపాణి మహరాజ్ తేల్చిచెప్పారు. అయోధ్యలో నిర్మిస్తున్నట్లుగా.. అమరావతిలోనూ భవ్య రామ మందిరాన్ని, అమరేశ్వర ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. వీటితో పాటు ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీరాముడు, అమరేశ్వరుని విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆలయాల నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని.. చక్రపాణి మహరాజ్ పిలుపునిచ్చారు.
Next Story