అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్

అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్
X

marri.png

మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు. రాజకీయ పార్టీలను పిలిచి నామమాత్రపు సమావేశం ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సమావేశం వల్ల ప్రయోజనం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌ రెడ్డి. పండగల తర్వాత కొంత సమయం ఇచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించమని కోరినట్టు.. తెలిపారు శశిధర్‌. తమ మాటలు వినేందుకు ఎన్నికల కమిషనర్‌ సిద్ధంగా లేరన్నారు. దురుసుగా మాట్లాడినందుకే సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు మర్రిశశిధర్‌ రెడ్డి తెలిపారు.మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు. రాజకీయ పార్టీలను పిలిచి నామమాత్రపు సమావేశం ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సమావేశం వల్ల ప్రయోజనం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌ రెడ్డి. పండగల తర్వాత కొంత సమయం ఇచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించమని కోరినట్టు.. తెలిపారు శశిధర్‌. తమ మాటలు వినేందుకు ఎన్నికల కమిషనర్‌ సిద్ధంగా లేరన్నారు. దురుసుగా మాట్లాడినందుకే సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు మర్రిశశిధర్‌ రెడ్డి తెలిపారు.

Tags

Next Story