ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.30,000

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 75 పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల భర్తీ కాంట్రాక్ట్ పద్దతిలో జరుగుతుంది. కాంట్రాక్ట్ మూడేళ్లు ఉంటుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది. పథకాలు, స్కీములకు సంబంధించిన అంశాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 జనవరి 10 దరఖాస్తుకు చివరి తేదీ. నోటిపికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ http://www.kvic.org.in/ చూడొచ్చు.
మొత్తం పోస్టులు : 75.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 10.. విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా 2 ఏళ్ల పీజీ డిప్లొమా.. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిసుండాలి. వేతనం: రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్: రూ.2500 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. వయసు: 27 ఏళ్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com