హైదారాబాద్‌కి ఇక సెలవు అంటున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

హైదారాబాద్‌కి ఇక సెలవు అంటున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
X

pre4sident

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. తిరిగి ఢిల్లీ పయనమయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ ఘనంగా వీడ్కోలు పలికారు. కేసీఆర్‌.. కోవింద్‌కు శాలువా కప్పి, జ్ఞాపికను ఇచ్చి సన్మానించారు. ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏటా డిసెంబర్‌లో రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో విడిది చేస్తారు. ఈ ఏడాది శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 20 నుంచి 22 వరకు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత 23న మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. తిరిగి గురువారం హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం సాయంత్రం బొల్లారం ఎట్ హోం నిర్వహించారు.

Tags

Next Story