సీపీ అంజనీకుమార్ టీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్‌కు తొత్తుగా పని చేస్తున్నారు: ఉత్తమ్

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌పై టీపీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. పార్టీ ఆఫీసులో సత్యాగ్రహదీక్ష చేస్తే.. వేల మంది పోలీసులతో తమ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అంజనీ కుమార్ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అంజనీ కుమార్ ఎక్కడ, ఎప్పుడు ఏం చేశాడో తెలుసన్నారు. ఆ చిట్టా అంతా గవర్నర్ ముందు ఉంచుతామన్నారు. టీఆర్‌ఎస్‌కు, ఆర్‌ఎస్‌ఎస్‌కు తొత్తుగా అంజనీ కుమార్ వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ యాత్రకు భయపడి అనుమతి ఇవ్వలేదన్నారు. ర్యాలీకి ఇబ్బంది లేని మార్గాన్ని ఇవ్వాలని పోలీసులను కోరినా అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గాంధీభవన్‌కు రాకుండా కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమని భట్టి మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com