ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. గర్భం దాల్చిన మహిళా కళాశాల విద్యార్థిని

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. గర్భం దాల్చిన మహిళా కళాశాల విద్యార్థిని

rap

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్ మహిళ డిగ్రీ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థిని గర్భం దాల్చింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్‌ నెలలో జనరల్ చెకప్‌ సందర్భంగా పది మంది విద్యార్థినులను ఆదిలాబాద్ రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా ముగ్గురు విద్యార్థులకు ప్రెగ్నెన్సీ పాజిటీవ్‌ రావడంతో, మళ్లీ వారం రోజుల తర్వాత రిమ్స్‌ను తీసుకురావాలని వైద్యులు సూచించారు.

అయితే వారం తర్వాత రిమ్స్‌కు తీసుకువెళ్లకుండా జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో జనరల్ చెకప్ చేయించగా ఒకరికి గర్భం నిర్థారణ అయింది. మరో ఇద్దరు విద్యార్థినులకు అనారోగ్యం కారణం వల్ల రిపోర్టు తప్పుగా వచ్చిందని కళాశాల సిబ్బంది తెలిపారు. ప్రెగ్నెన్సీ అయిన విద్యార్థిని పేరెంట్స్‌కి చెప్పారు.. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లామని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ విషయాన్ని పరీక్షలు ఉన్నాయనే కారణం చెబుతూ బయటకు పొక్కుండా చేశారు. విద్యార్ధిని ప్రెగ్నెన్సీపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story