అల్లరి మూకలకు గట్టి జలక్‌ ఇచ్చిన యోగి సర్కార్‌

అల్లరి మూకలకు గట్టి జలక్‌ ఇచ్చిన యోగి సర్కార్‌
X

cm-yogi

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్‌లో అల్లరి మూకలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సీఏఏ బిల్లు ఆమోదం తరువాత రెచ్చిపోయిన ఆందోళనకారులు... ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. బస్సులు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహించిన యోగి సర్కార్‌.. అల్లరి మూకలకు గట్టి జలక్‌ ఇచ్చింది. విధ్వంసం చేసిన అల్లరి మూకల ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటించిన యోగి ప్రభుత్వం అన్నంత పని చేసింది. ఇప్పటి వరకు 500 మంది నిందితులను గుర్తించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. 5 వందల మంది ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించిన అధికారులు.. 498 మందిని గుర్తించి వారికి ముందుగా నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత ఆస్తులు జప్తులు చేశారు. ప్రస్తుతం వీరంత జైలులో ఉన్నారు. మరికొంత మంది నిందితులను గుర్తించిన అధికారులు.. వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. యోగి సర్కార్‌ హెచ్చరిక గట్టిగా పని చేసింది.. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా యూపీలో చేపట్టిన నిరసనలు ప్రశాంతంగా ముగిశాయి. విధ్వంసాలకు పాల్పడితే.. ఆస్తులను సీజ్‌ చేస్తామని... జాగ్రత్తగా ఉండాలని అల్లరి మూకలను ప్రభుత్వం హెచ్చరించింది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అరుదైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసా విధ్వంసాలకు పాల్పడ్డందుకు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కొన్ని ముస్లిం గ్రూపులు స్థానిక పాలనా యంత్రాంగానికి క్షమాపణ చెప్పాయి. అంతేకాదు తీవ్ర ఆస్తినష్టం కలిగించినందుకు 6 లక్షల 27లక్షల పరిహారాన్ని కూడా చెల్లించాయి. ఇందులో భాగంగా ఓ డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను ప్రభుత్వాధికారులకు అందజేశారు. ఆందోళనకారులు ఓ ప్రభుత్వ వాహనంతో పాటు ఇతర వాహనాలను కూడా ధ్వంసంచేశారు. ప్రభుత్వ వాహనాన్ని తగులబెట్టినందుకు చింతిస్తూ ఈ డ్రాఫ్ట్‌ను ఇచ్చారని ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Next Story