పౌరసత్వ సవరణ బిల్లు చుట్టు పొలిటికల్ షో

పౌరసత్వ సవరణ బిల్లు చుట్టు పొలిటికల్ షో

caa-protest

పౌరసత్వ సవరణ బిల్లు పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధాన్నే సృష్టించింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా CAA విషయంలో ప్రతిపక్షాలు..ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా అంతే రేంజ్ లో పట్టుదలగా ఉంది. దీంతో పౌరసత్వ సవరణ బిల్లుపై ర్యాలీలు, నిరసనలు, ఉద్రిక్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

CAA ఆందోళనలకు సంబంధించి మిగతా రాష్ట్రాల కంటే మొదట్నుంచి యూపీలోనే ఎక్కువ అలజడి కనిపిస్తోంది. ఆందోళనలు, నిరసనలు, రాళ్లదాడులు, కాల్పులతో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి తగ్గగానే రాజకీయ దుమారం మొదలైంది. కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవం వేళ.. దేశాన్ని కాపాడండి-రాజ్యాంగాన్ని రక్షిం చండి పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమానికి ప్రియాంక హాజరయ్యారు. ర్యాలీ తర్వాత ఆందోళనల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు ప్రియాంక బయల్దేరారు. అయితే పోలీసులు అడ్డుకోవటంతో కాన్వాయ్ వదిలేసి యూపీ పీసీసీ చీఫ్ టూవీలర్ పై వెళ్లారామె.

అడుగడునా తనని అడ్డుకున్న పోలీసులు..తనపై చేయిచేసుకున్నారన్న ప్రియాంక ఆరోపణలు సంచలనం రేపాయి. పోలీసులు టూవీలర్ ను కూడా అడ్డుకోవటంతో తాను నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించానని..అయితే..తనను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు పోలీసులు తన మెడపై చేయి వేసి గెంటేశారని ఆమె ఆరోపించారు.

ప్రియాంకగాంధీ ఆరోపణలతో యూపీ పోలీసులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారంటూ ఫైర్ అయిపోయారు. ప్రియాంక పట్ల అమర్యాదగ ప్రవర్తించిన పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు గౌహతి పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. CAA, NRC అంటే నోట్ల రద్దు సెకండ్ ఎపిసోడ్ అన్నట్లేనని విమర్శించారు. కేంద్రం ప్రజాసమస్యలు వదిలేసి మత విద్వేషాలు సృష్టిస్తోందని విమర్శించారు.

CAAకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల స్పీడుకు ధీటుగా బీజేపీ కూడా విరుగుడు ర్యాలీలతో జనంలోకి వెళ్తోంది. నిరసనల తీవ్రత తగ్గుముఖం పట్టిన వేళ, మద్ధతు ర్యాలీలతో జోరు పెంచింది. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, సీఏఏకు మద్ధతుగా ర్యాలీలు, అవగా హన సదస్సులు నిర్వహిస్తున్నాయి. అసోంలో స్వయంగా ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ రంగంలోకి దిగారు. పౌరచట్టానికి మద్ధతుగా మోరేగావ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags

Next Story