ఉగ్రదాడి.. 80 మంది మృతి

ఉగ్రదాడి.. 80 మంది మృతి
X

bomb

సొమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. అత్యంత రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్‌పోయింట్ వద్ద ట్రక్కు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈపేలుడు ఘటనలో 80 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సొమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్‌ ఈ ఉగ్రదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన భారీ ట్రక్కు పేలుడుతో దాదాపు 512 మందికి పైగా మృతి చెందగా, 295 మంది గాయపడ్డారు.

Tags

Next Story