నర్సాపూర్‌లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమయత్తం అవుతుంది. సన్నాహక సభలతో కేడర్‌లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని కుంతియా మండిపడ్డారు. బీజేపీ, ఎంఐఎం పార్టీల సమావేశాలకు అనుమతి ఇచ్చి... కాంగ్రెస్ పార్టీ సభకు మాత్రం అనుమతి ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీలను గెలించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కుంతియా. ధనిక రాష్ట్రమైన తెలంగాణను... కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com