29 Dec 2019 8:21 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / సీఎం జగన్ విశాఖ పర్యటన...

సీఎం జగన్ విశాఖ పర్యటన ఉత్తరాంధ్రవారిని నిరాశ పరిచింది - సీపీఎం నేత రాఘవులు

సీఎం జగన్ విశాఖ పర్యటన ఉత్తరాంధ్రవారిని నిరాశ పరిచింది - సీపీఎం నేత రాఘవులు
X

visakha-utsav

సీఎం జగన్‌ విశాఖ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు సీపీఎమ్‌ నేత రాఘవులు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకునేవారు.. లాభాదాయక రైల్వే జోన్‌, ఉక్కు పరిశ్రమ సొంతగనులు, గిరిజన వర్సిటీ కోసం ప్రయత్నించాలన్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు.. తెలంగాణ క్యాష్‌ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాఘవులు అభిప్రాయపడ్డారు. అధ్యక్ష తరహా పాలన సాగే దేశాల్లో రాజధానులు వేర్వేరు చోట్ల ఉండవచ్చుకానీ.. పార్లమెంటరీ డెమోక్రసీలో అలా కుదరదన్నారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితి, రాజకీయ అల్లకల్లోలకు వ్యతిరేకంగా జనవరి 8న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్టు తెలిపారు రాఘవులు.

Next Story