రాజధాని అంశంపై ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం

రాజధాని అంశంపై ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం
X

all-partys

రాజధాని అంశంపై... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పలు రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు ఈ భేటీ పాల్గొని... మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ జెడ్పీ చైర్మన్‌ బాపిరాజుతోపాటు కాంగ్రెస్‌, జనసేన నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. పరిపాలన వికేంద్రీకరించడం వల్ల అమరావతి నష్టపోతుందన్నారు నిమ్మల రామానాయుడు. రాజధానిపై ప్రభుత్వం వేసింది హై పవర్ కమిటీ కాదని... హై చీటింగ్‌ కమిటీ అని మండిపడ్డారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులకు ధీటైన రాజధాని లేకపోతే... ఏపీలో పెట్టుబడులు, ఉద్యోగాలు ఎలా వస్తాయని నిమ్మల ప్రశ్నించారు.

Tags

Next Story