వైసీపీకి చెక్‌ పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో రాక్షస పాలన : టీడీపీ

వైసీపీకి చెక్‌ పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో రాక్షస పాలన : టీడీపీ

mla-nimmala

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి చెక్‌ పెట్టకపోతే... రాబోయే రోజుల్లో రాక్షస పాలన చూడాల్సి వస్తుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పార్టీని బలోపేతం చేయడంపై... పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలకు సూచనలు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే నిమ్మల, మాజీ జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని... పలు అంశాలపై చర్చించారు. ఆరునెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు నిమ్మల రామానాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో... టీడీపీని గెలిపించేలా... నియోజకవర్గాల వారీగా సంస్థాగత నిర్మాణం చేస్తున్నట్టు నిమ్మల తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story