రేపు తెలంగాణ గవర్నర్ తమిళసైతో.... టీ కాంగ్రెస్ నేతల భేటీ

రేపు(30/12/2019) తెలంగాణ గవర్నర్ తమిళసైతో.... టీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ చొరవచూపాలని వినతి చేయనున్నారు. శనివారం రోజున.... పోలీస్ కమిషనర్ వైఖరిని నిరసిస్తూ ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు. గవర్నర్‌ను కలుస్తున్నవారిలో..... టీపీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు ముఖ్యనేతలు... ఉన్నారు.
శనివారం సత్యాగ్రహ దీక్ష సందర్భంగా... పోలీసు కమిషనర్ బాధ్యత రహితంగా ప్రవర్తించారంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సత్యగ్రహ దీక్ష చేస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన పోలీస్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతిభద్రతల అంశంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.