ఆకస్మిక తనిఖీలతో షాకిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు

ఆకస్మిక తనిఖీలతో షాకిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు

officers

తెలుగు రాష్ట్రాల్లో ఇన్నాళ్లపాటు ఆకస్మిక తనిఖీలుకు మీనింగ్ లేకుండా పోయింది. నాలుగు ఫోటోలు వీలైతే ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈ అకస్మిక తనిఖీల ట్రిక్కును వాడుకోటం చాలానే చూసే ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఆఫీసర్లు సమ్ థింగ్ స్పెషల్. ఆకస్మిక తనిఖీలంటే ఇలా ఉండాలని చాటి చెప్పారు. సామాన్యుడిలా వెళ్లిన సిబ్బంది పనితీరును స్కాన్ చేసి గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న వాస్తవాలను తెల్సుకున్నారు. వచ్చింది పెద్ద సార్లు అనే విషయం తెలియక పాపం ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్ గా బుక్కైపోయారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఆర్డర్లు చూసుకొని ఖంగుతిన్నారు.

ప్రకాశం జిల్లాలో అదే జరిగింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే సిబ్బందితో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెల్సుకోవాలని డిసైడ్ అయ్యాడు ఎస్సీ సిద్ధార్థ్ కౌశల్. అయితే..తాను వెళ్తే గుర్తుపడతారు కనుక..ఓ ట్రైనీ ఐపీఎస్ ను ఫిర్యాదుదారిడిగా పంపించాడు. ఆ ట్రైనీ ఐపీఎస్ తన మొబైల్ ఫోన్ లాక్కెళ్లిపోయారని కంప్లైట్ చేశాడు. మొబైల్ కేసు కావటంతో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. కేసు ఫైల్ చేసి రిసీప్ట్ ఇవ్వాలని ట్రైనీ ఐపీఎస్ అడగటంతో శివాలెత్తిపోయిన స్టేషన్ సిబ్బంది..ఆ చినసారును చెడామడా తిట్టేశారు. ఇదే విషయాన్ని ఎస్సీకి రిపోర్ట్ చేశాడా ట్రైనీ ఆఫీసర్. దీంతో స్టేషన్ లో నోటీ దురుసు చూపించిన రైటర్ ను సస్పెండ్ చేయటంతో పాటు సీఐ, ఎస్సై, మరో నలుగురు పోలీసులకి చార్జి మెమోలు జారీ చేశారు.

మొన్నటి మొన్న నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆస్పత్రికి సిబ్బందిని ఇదే తరహాలో హడలెల్తించారు. పోస్టింగ్ తీసుకున్న వారం రోజుల్లోనే కలెక్టర్ అంటే ఉద్యోగుల్లో ఓ రకమైన ఇమేజ్ క్రియేట్ చేశాడు. కలెక్టర్ అర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఓ సామాన్యుడిలా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడతను. తాను బస చేస్తున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ నుంచి సైకిల్ మీద ఆస్పత్రికి వెళ్లిన కలెక్టర్ నారాయణరెడ్డి..ఆస్పత్రిలో ప్రజలకు చికిత్స అందుతున్న తీరును స్వయంగా పరిశీలించాడు. అన్ని డిపార్ట్ మెంట్లు తిరుగుతూ సిబ్బంది సమయానికి వచ్చారో లేదో చెక్ చేశాడు. రాని వారి వివరాలను అడిగితెల్సుకున్నాడు. ఆ తర్వాత ఒరిజినల్ మోడ్ లోకి మారిన కలెక్టర్.. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందికి మెమోలు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story