29 Dec 2019 10:05 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ రాష్ట్ర...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చెన్నారెడ్డి ఉద్యమ ప్రభావం ఉంది : ఉపరాష్ట్రపతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చెన్నారెడ్డి ఉద్యమ ప్రభావం ఉంది : ఉపరాష్ట్రపతి
X

venkayya

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చెన్నారెడ్డి చేసిన ఉద్యమ ప్రభావం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు .హైదరాబాద్ శిల్పకళావేదికలో మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .తెలుగు వారు గర్వించగలిగే నాయకుడు చెన్నారెడ్డి అని..హైదరాబాద్ పేరుతో విజయవాడ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపిన వ్యక్తి అని కొనియాడారు. ఉద్యమం చేసేవాళ్ళు ...హింసకు తావు ఇవ్వకూడదన్నారు. పౌరసత్వ బిల్లు , ఎన్‌ఆర్‌సీపై అర్థవంతమైన చర్చకొనసాగాల్సిన అవసరం ఉందన్నారు .ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య , కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియ, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story