అనంతపురం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం జిల్లా కదిరి గాండ్లపెంటలోని ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దాసరివాండ్లపల్లికి చెందిన రజిత స్కూల్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. విద్యార్థిని పరిస్థితి విషమించడంతో కదిరి ఆస్పత్రికి ఉపాధ్యాయులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రజిత మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. స్కూలుకు వెళ్లిన కుమార్తె శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story