నెటిజన్ కామెంట్‌కి రేణూ దేశాయ్ ఫీల్..

నెటిజన్ కామెంట్‌కి రేణూ దేశాయ్ ఫీల్..
X

Renu-desai

ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్నారు.

తాజాగా అకీరా చెల్లి ఆద్యను ఎత్తుకున్న ఫోటోను రేణు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ క్యాప్షన్.. '1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా.. ఆద్య, అకీరా క్రేజీ ఫెలోస్.. ఎందుకంటే వాళ్లు నా పిల్లలు కదా అని రాసుకొచ్చారు. అయితే రేణూ క్యాప్షన్‌‌కి నెటిజన్ స్పందిస్తూ.. ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. అలా అనడం రేణూ దేశాయ్‌కి ఎంత మాత్రం నచ్చలేదు.

వెంటనే రిప్లై ఇస్తూ.. టెక్నికల్‌గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం.. మీకు సైన్స్ తెలిస్తే ఈ మాటకు అర్థం తెలుస్తుంది అని సమాధానం ఇచ్చారు. రేణూ రిప్లైకి చాలా మంది సంతోషిస్తూ హ్యాట్సాఫ్ మేడమ్ అని చెప్పారు. నిజానికి అకీరాని జూనియర్ పవర్ స్టార్ అని అనడం కూడా రేణూకి నచ్చేది కాదు. ఆ విషయంపై కూడా నెటిజన్స్‌కి ఘాటుగానే రిప్లై ఇచ్చారు గతంలో రేణు. కవితలు రాస్తూ, పుస్తకాలు చదువుతూ, పిల్లల్ని పెంచుతూ, తనదైన ప్రపంచంలో ఆనందంగా గడిపేస్తున్నారు రేణూ దేశాయ్. ఓ సినిమాకు దర్శకత్వం చేస్తూ ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు.

Next Story