30 Dec 2019 6:23 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / రైతులు, మహిళల...

రైతులు, మహిళల రిలేదీక్షలు

రైతులు, మహిళల రిలేదీక్షలు
X

amaravati

రాజధాని మార్పు ప్రతిపాదనలపై అమరావతి అట్టుడుకుతోంది. 13వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మండదం, ఉద్దండరాయుని పాలెంలో రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని నినాదంతో గళమెత్తారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు రిలేదీక్షకు దిగారు. రోడ్లపై రాస్తారోకోలు, వంటావార్పులతో నిరసన తెలుపుతున్నారు. మందడంలో మహాధర్నాకు దిగారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి యుతంగా నిరసన చేస్తున్న తమపై ప్రభుత్వం కక్షకట్టిందని మండిపడుతున్నారు. అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.

మరో వైపు ఆరుగురు రైతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సచివాలయంకు వెళ్లే మార్గంలో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.

Next Story